Share News

ఈ భూమి మీద తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్.. ఆయన వాటాదారులకు కూడా భారీ లాభాలు..

ABN , Publish Date - May 24 , 2026 | 10:35 AM

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. త్వరలో ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మారే దిశగా దూసుకెళ్తున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ భూమి మీద తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్.. ఆయన వాటాదారులకు కూడా భారీ లాభాలు..
Elon Musk trillionaire

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. త్వరలో ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మారే దిశగా దూసుకెళ్తున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఆయన వ్యక్తిగత సంపద లక్ష కోట్ల డాలర్ల (రూ.96 లక్షల కోట్లు)కు చేరుకోనుంది. దీనికి ప్రధాన కారణం ఆయన సంస్థ 'స్పేస్ ఎక్స్' భారీ ఐపీఓకు సిద్ధమవుతుండడం (Elon Musk trillionaire).


'స్పేస్ ఎక్స్' ఐపీఓ ద్వారా కంపెనీ విలువ సుమారు 1.75 లక్షల డాలర్ల వరకు చేరే అవకాశం ఉంది. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ 'స్పేస్ ఎక్స్' ఐపీఓ సందర్భంగా 2 లక్షల డాలర్ల మార్కెట్ విలువ పొందితే మస్క్ నికర సంపద 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుటుంది. ఒకవేళ 1.75 లక్షల కోట్ల డాలర్ల వద్దే ఆగిపోయినా.. టాస్లా, ఇతర సంస్థల్లో ఉన్న వాటాలతో కలిపితే మస్క్ మొత్తం సంపద సులభంగా లక్ష కోట్ల డాలర్లను దాటిపోతుంది (SpaceX IPO).


ఈ భారీ ఐపీఓతో మస్క్ ఈ భూమ్మీదే తొలి ట్రిలియనీర్‌గా అవతరించనున్నారు (World first trillionaire). కాగా, ఈ ఐపీఓతో కంపెనీలోనే పలువురు ఉద్యోగులు బిలియనీర్లుగా మారబోతున్నారు. 'స్పేస్ ఎక్స్' అనుకున్న మార్కెట్ విలువను పొందితే.. సంస్థ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్, సీఎఫ్‌ఓ బ్రెట్ జాన్సన్, బోర్డు డైరెక్టర్ ల్యూక్ నాసెక్ కూడా బిలియనీర్లు కాబోతున్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..


ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 24 , 2026 | 10:52 AM