పనస వడ.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - May 24 , 2026 | 12:32 PM
పనస వడ.. తయారీకి కావాల్సినవి.. పనసకాయ తొనలు - కప్పు, వరి పిండి - అర కప్పు, తాజా కొబ్బరి తురుము - పావు కప్పు
కావలసిన పదార్థాలు: పనసకాయ తొనలు - కప్పు, వరి పిండి - అర కప్పు, తాజా కొబ్బరి తురుము - పావు కప్పు, పచ్చి మిర్చి - మూడు, కరివేపాకు - కొన్ని, జీలకర్ర - స్పూను, నూనె, నీళ్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: పనస తొనలను నీళ్లలో ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఉదయం ఆ నీళ్లను తీసేసి మూడు నాలుగు సార్లు వేరే నీళ్లతో కడగాలి. మిక్సీలో పనస తొనలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చి మిర్చి, ఉప్పు వేసి మిక్సీలో కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని వరి పిండిని కలపాలి. కరివేపాకు రెబ్బలు కూడా వేసి, చిన్న చిన్న ముద్దలుగా చేసి వడలా వత్తుకుని నూనెలో వేయిస్తే పనస వడ తయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..
వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News