Share News

పెట్స్‏తో సంభాషణ!

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:50 PM

మనం చెప్పే విషయాలు చాలావరకు పెంపుడు జంతువులకు అర్థమవుతాయి.

పెట్స్‏తో సంభాషణ!
AI Pet Translator

మనం చెప్పే విషయాలు చాలావరకు పెంపుడు జంతువులకు అర్థమవుతాయి. కానీ అవి మనకు ఏమైనా చెప్పాలనుకుంటే..? దీనికి పరిష్కారంగా... చైనాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఒక సరికొత్త ఆలోచన చేసింది. గ్యాడ్జెట్‌ను రూపొందించింది.

చైనాకు చెందిన మెంగ్‌ జియావోయి అనే స్టార్టప్‌ కంపెనీ... పెంపుడు జంతువుల అరుపులను, ప్రవర్తనలను మనిషికి అర్థమయ్యేలా అనువదించే ఏఐ ఆధారిత ‘కాలర్‌ పెట్‌చాట్‌’ను అభివృద్ధి చేసింది. ఈ గ్యాడ్జెట్‌ ఎలా పనిచేస్తుందో యూట్యూబ్‌లో ఒక డెమో వీడియోని కూడా అప్‌లోడ్‌ చేశారు.


కుక్కలు, పిల్లులు అరిచినప్పుడు... ఆ అరుపునకు అర్థమేంటో ఫోన్‌ యాప్‌లో మెసేజ్‌ రూపంలో వస్తుంది. అంటే... పెంపుడు జంతువు ఏం అనుకుంటుందో దాని యజమానికి ఇట్టే తెలిసిపోతుంది. ఈ ‘పెట్‌చాట్‌’... మైక్రోఫోన్స్‌, మోషన్‌ సెన్సార్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా పని చేస్తుంది. వైర్‌లెస్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ కాలర్‌ పెట్స్‌కు సంబంధించి 20కి పైగా భావోద్వేగాలను గుర్తిస్తుందంటున్నారు.


కొన్నిసార్లు వాటి యజమానులు ఇచ్చే సందేశాలను కూడా ఈ కాలర్‌ అనుకూలమైన శబ్దాలుగా, సంకేతాలుగా మారుస్తుంది. ఇది జీపీఎస్‌ ట్రాకింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ధర సుమారు 11 వేల రూపాయలు. ఇప్పటికే ఈ గ్యాడ్జెట్‌ను 10 వేల మందికి పైగా ప్రీ బుక్‌ చేసుకున్నారట. దీనిని బట్టి యజమానులకు తమ పెంపుడు జంతువుల పట్ల అమితమైన ప్రేమ ఉందని తెలుస్తోంది కదూ!


ఈ వార్తలు కూడా చదవండి:

అఖాడాల అడ్డా

ఆషాఢ వేళ... మెహందీ కళ!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 01:50 PM