ఉల్లి కచోరి...ఇలా చేస్తే ఆ టేస్టే వేరు...
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:26 PM
ఉల్లి కచోరి... తయారీకి కావాల్సినవి.. కప్పు - మైదా, శనగ పిండి - స్పూను, ఉడికించిన ఆలు - రెండు, చక్కెర - అర స్పూను.
కావలసిన పదార్థాలు: కప్పు - మైదా, శనగ పిండి - స్పూను, ఉడికించిన ఆలు - రెండు, చక్కెర - అర స్పూను, కారం - స్పూను, ఆమ్‌చూర్-స్పూను, ధనియాలు - స్పూను, జీలకర్ర - అర స్పూను, ఉల్లి - ఒకటి, గరం మసాలా-అర స్పూను, పచ్చి మిర్చి - రెండు, వెల్లుల్లి పేస్టు - స్పూను, ఇంగువ-కాస్త, ఆవాలు-అర స్పూను, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో మైదా పిండి, ఉప్పు, స్పూను నూనె, కాస్త నీళ్లు వేసి పూరీ పిండిలా కలుపుకుని మూత మూసి పక్కన పెట్టాలి. ఉల్లి, మిర్చిలను కట్ చేసుకోవాలి. ఉడికించిన ఆలూను ముద్దగా చేసుకోవాలి. ఓ బాణలిలో స్పూను నూనె వేసి వెల్లుల్లి, అల్లం పేస్టు, ఇంగువ, జీలకర్ర, చక్కెర, ఆవాలు చిటపటలాడించాలి. ఆ తరవాత ధనియాలు, ఉల్లి, మిర్చి, ఉప్పు చేర్చాలి. ఉల్లిరంగు మారుతుంటే కారం, ఆలూ, ఆమ్‌చూర్, శనగ పిండి, గరం మసాలా వేయాలి. అంతా దగ్గరకి అవుతుంటే స్టవ్ కట్టేసి, చల్లారనివ్వాలి. పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని, ఈ ముద్దలో ఆలూ మిశ్రమాన్ని ఉంచి కచోరీలా చేసుకుని నూనెలో వేయిస్తే సరి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News