Share News

ఇరాన్‌పై అమెరికా దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన ఐఆర్‌జీసీ..

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:38 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది సేపటికే అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.

ఇరాన్‌పై అమెరికా దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన ఐఆర్‌జీసీ..
US Iran War

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది సేపటికే అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది (US Iran War).


కొన్ని నౌకలు తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అనుమతి లేని మార్గంలో ప్రయాణించాయని ఆరోపించిన ఐఆర్‌జీసీ.. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అమెరికా జోక్యం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సైప్రస్ జెండా కలిగిన ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసిందని అమెరికా ప్రకటించింది ( Iran, Gulf Tensions).


అమెరికా సైన్యం ఆదివారం ఉదయం ఇరాన్ స్థావరాలపై దాడులు చేసింది. దీనికి ప్రతిగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలతో అనేక దాడులను అడ్డుకున్నట్లు ఆయా దేశాలు వెల్లడించాయి (Iran US Airstrikes).


కాగా, హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ చాలా చెడు నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని అమెరికా హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానాన్ని అడ్డుకోవడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన 'సర్జీ'.. రోబోలతో లైవ్ సర్జరీ విజయవంతం..

Updated Date - Jul 12 , 2026 | 11:42 AM