Share News

వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన 'సర్జీ'.. రోబోలతో లైవ్ సర్జరీ విజయవంతం..

ABN , Publish Date - Jul 12 , 2026 | 07:54 AM

వైద్యరంగంలో రోబోటిక్స్ వినియోగం రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ డియాగో పరిశోధకులు అభివృద్ధి చేసిన 'సర్జీ' అనే హ్యూమనాయిడ్ రోబోలు రెండు జీవులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాయి.

వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన 'సర్జీ'.. రోబోలతో లైవ్ సర్జరీ విజయవంతం..
Humanoid Robot Surgery

వైద్యరంగంలో రోబోటిక్స్ వినియోగం రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ డియాగో పరిశోధకులు అభివృద్ధి చేసిన 'సర్జీ' (Surgie) అనే హ్యూమనాయిడ్ రోబోలు రెండు జీవులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాయి. ప్రపంచ వైద్య రంగంలో ఇలాంటి సర్జరీలు జరగడం ఇదే తొలిసారి (Humanoid Robot Surgie).


పరిశోధకులు బతికి ఉన్న రెండు పందులపై లాప్రోస్కోపిక్ గాల్‌బ్లాడర్ తొలగింపు (Cholecystectomy) శస్త్రచికిత్సలను నిర్వహించారు. మొదటి శస్త్రచికిత్సలో ఒక హ్యూమనాయిడ్ రోబోకు మానవ సర్జన్ సహకరించారు. రెండో శస్త్రచికిత్సలో రెండు హ్యూమనాయిడ్ రోబోలు కలిసి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశాయి. శస్త్రచికిత్స సమయంలో కణజాలాన్ని పట్టుకోవడం, విడదీయడం, క్లిప్‌లు అమర్చడం, గాల్‌బ్లాడర్‌ను సురక్షితంగా తొలగించడం వంటి క్లిష్టమైన దశలను రోబోలు సమర్థంగా నిర్వహించాయి (Robot Surgery).


కాగా, ఈ రోబోలు స్వతంత్రంగా ఆలోచించి శస్త్రచికిత్స చేయలేదు (Surgical Robot). అనుభవజ్ఞులైన సర్జన్లు దూరం నుంచి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ద్వారా ప్రతి కదలికను నియంత్రించారు. ఈ విధానాన్ని టెలీఆపరేషన్ అని పిలుస్తారు. అంటే తుది నిర్ణయాలు, నియంత్రణ మాత్రం మానవ వైద్యుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైనప్పటికీ, ప్రస్తుతం ఇది జంతువులపై నిర్వహించిన ప్రీ-క్లినికల్ అధ్యయనం మాత్రమే. మానవులపై వినియోగానికి ముందు భద్రత, ఖచ్చితత్వం, పనితీరుపై మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.


Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 12 , 2026 | 07:54 AM