మొసళ్లు ఇలా కూడా చేస్తాయా.. భయానక వీడియో వైరల్..
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:15 AM
సాధారణంగా ఏ క్రూర జంతువు అయినా వేరే జాతి జీవులనే ఆహారంగా తీసుకుంటుంది. పాములు మాత్రమే అప్పుడప్పుడు తమ పిల్లలను తినేస్తాయని అనుకుంటుంటాం.
సాధారణంగా ఏ క్రూర జంతువు అయినా వేరే జాతి జీవులనే ఆహారంగా తీసుకుంటుంది. పాములు మాత్రమే అప్పుడప్పుడు తమ పిల్లలను తినేస్తాయని అనుకుంటుంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక మొసలి చిన్న మొసలిని అమాంతం మింగేసింది. ఆ వీడియో చూడడానికి చాలా భయంకరంగా ఉంది (Crocodile viral video).
వైరల్ వీడియోలో, నది ఒడ్డున ఉన్న ఓ భారీ మొసలి తన దవడలతో చిన్న మొసలిని గట్టిగా పట్టుకుని ఉంది. ఆ తర్వాత కొద్ది సెకన్లలోనే దానిని పూర్తిగా మింగేసింది. చిన్న మొసలి తప్పించుకునేందుకు ప్రయత్నించినా భారీ మొసలి బలమైన దవడల నుంచి బయటపడలేకపోయింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన చాలా మంది నెటిజన్లు షాకవుతున్నారు. ప్రకృతిలోని క్రూరత్వం మరోసారి కళ్లకు కట్టినట్లు ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు (Crocodile cannibalism).
వన్యప్రాణి నిపుణుల ప్రకారం, ఒక మొసలి మరో మొసలిని వేటాడి తినడం అనేది అసాధారణం కాదు (Wildlife Viral Video). ముఖ్యంగా పెద్ద మొసళ్లు అవకాశమొస్తే చిన్న మొసళ్లపై దాడి చేసి ఆహారంగా మార్చుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఆహార కొరత, ఆధిపత్య పోరు వంటి కారణాల వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి.
ఇవి కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన 'సర్జీ'.. రోబోలతో లైవ్ సర్జరీ విజయవంతం..