హోర్ముజ్‌లో దాడి.. తమ తప్పిదమేనని ఇరాన్ నాయకులు అంగీకరించారా..
ABN , Publish Date - Jul 12 , 2026 | 09:03 AM
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన వాణిజ్య నౌకలపై దాడుల వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన వాణిజ్య నౌకలపై దాడుల వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ విషయంలో తప్పు తమదేనని ఇరాన్ నాయకులు అంగీకరించినట్టు అమెరికా మీడియా ఓ కథనం వెలువరించింది. ఆ దాడుల వెనుక తమ ఆదేశాలు లేవని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది (Iran Strait of Hormuz).
అమెరికా మీడియా కథనాల ప్రకారం, వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు తమ తప్పిదమే అని ఇరాన్ నాయకులు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారులకు ఇరాన్ ప్రతినిధులు రహస్యంగా సందేశం పంపారని తెలుస్తోంది. ఈ దాడులకు తమ అత్యున్నత నాయకత్వం ఆదేశాలు ఇవ్వలేదని, చర్చలను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఓ అతివాద వర్గం చేసిన దుందుడుకు చర్యల వల్ల ఈ ఘటన జరిగిందని ఇరాన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది (Iran US talks).
అమెరికా-ఇరాన్ మధ్య ఒమాన్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి (Hormuz attacks). ఆ చర్చలకు ముందు ఇరాన్ ఈ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వివరణను అమెరికా పూర్తిగా అంగీకరించిందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా, ఇరాన్ ఇప్పటికీ దౌత్య చర్చలను కొనసాగించాలని కోరుకుంటోందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన 'సర్జీ'.. రోబోలతో లైవ్ సర్జరీ విజయవంతం..