Share News

సీఎం రేవంత్‌ను షాబాద్ నిందితుడితో పోల్చిన హరీశ్‌రావు..

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:59 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాబాద్‌ నిందితుడు రాజ్‌కుమార్‌కు తేడా లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్ మాటలు వింటే ఆయనలో సైకో కన్పిస్తున్నారంటూ మండిపడ్డారు.

సీఎం రేవంత్‌ను షాబాద్ నిందితుడితో పోల్చిన హరీశ్‌రావు..
Harish Rao Revanth Reddy,

హైదరాబాద్, జులై 12: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాబాద్‌ నిందితుడు రాజ్‌కుమార్‌కు తేడా లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్ మాటలు వింటే ఆయనలో సైకో కన్పిస్తున్నారంటూ మండిపడ్డారు. పొలాల్లో నీళ్లు పారించమంటే బూతులు పారిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ భాష శాడిస్ట్‌ మాట్లాడే భాషలా ఉందని.. రేవంత్‌లో శాడిస్ట్‌, బూతులు, అబద్ధాలు కనిపిస్తున్నాయని అన్నారు. హరీశ్‌రావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..


‘అబద్ధాలు, బూతుల్లో సీఎం రేవంత్‌తో పోటీపడలేం. మేం నీళ్లు పారించమంటే.. ఆయన రక్తం పారిస్తామంటున్నారు. హిట్లర్‌ తనకు ఆదర్శమన్న రేవంత్‌ అలాగే మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌లో ఫ్రస్టేషన్‌ కనిపిస్తోంది.. అందుకే అలా మాట్లాడుతున్నారు. నీళ్ల విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోం. రేవంత్‌కు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ రైతుల పంటల మీద లేదు. మేడిగడ్డ అంశంలో సీఎం రేవంత్‌ చెప్పేవన్నీ అబద్ధాలే’..


‘ముఖ్యమంత్రిగా 31 నెలలు పూర్తయినా.. కాళేశ్వరంపై రేవంత్‌కు అవగాహన రాలేదు. ఎల్లంపల్లి నుంచి 20 ఏళ్లుగా నీళ్లు తీసుకుంటున్నాం అంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 8 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్‌కు తాగునీరు రావాలి. వాస్తవాలు చెబుతుంటే జైలులో పెడతామని బెదిరిస్తున్నారు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

గానగాంధర్వి జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

ఇరాన్‌పై అమెరికా దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన ఐఆర్‌జీసీ..

Updated Date - Jul 12 , 2026 | 12:02 PM