పాలక్ ఇడ్లీ... తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:56 PM
పాలక్ ఇడ్లీ తయారీకి కావాల్సినవి.. ఇడ్లీ రవ్వ- కప్పు, మినప్పప్పు- అర కప్పు, మెంతులు - అర స్పూను, పాలకూర - అర కప్పు.
కావలసిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ- కప్పు, మినప్పప్పు- అర కప్పు, మెంతులు - అర స్పూను, పాలకూర - అర కప్పు, క్యారెట్ తురుము - రెండు స్పూన్లు, పనీరు - అర కప్పు, ఉల్లి ముక్కలు - అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, అల్లం తురుము - అర స్పూను, నూనె, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ఇండ్లీ పిండి తయారుచేసుకోవాలి. ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి జీలకర్ర చిటపటలాడించి, ఉల్లిని చేర్చాలి. రంగు మారాక పాలకూర, పనీర్, మిర్చి కూడా కలిపి కాసేపు వేయించి స్టవ్ కట్టేయాలి. చల్లారాక మిక్సీలో వేసి రుబ్బి పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్ గుంతల్లో పిండి వేసి, పైన ఒక్కో స్పూను పాలక్ పిండి, క్యారెట్ తురుము వేసి ఆవిరి పడితే పాలక్ ఇడ్లీ రెడీ.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News