ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 19 , 2026 | 07:15 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 19, 2026 21:38 IST
మార్చి 5న భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య పెళ్లి
సీఎం రేవంత్‌ను తన కొడుకు పెళ్లికి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం
-
Feb 19, 2026 21:33 IST
నాణ్యతలో హెరిటేజ్ ఎప్పుడూ రాజీ పడలేదు: 'ఎక్స్'లో నారా భువనేశ్వరి
రూ.4 కోట్లతో ప్రారంభమై రూ.4 వేల కోట్ల సంస్థగా హెరిటేజ్
25 నాణ్యత పరీక్షలు దాటాకే ప్రతి ఉత్పత్తి మీ ఇళ్లకు చేరుతుంది
-
Feb 19, 2026 20:44 IST
అమరావతి: యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ రెడీ చేయాలి
జాబ్ క్యాలెండర్‌తో పాటే వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు
కోచింగ్ సెంటర్ల నిర్వహణ గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై మంత్రి లోకేష్ సమీక్ష
-
Feb 19, 2026 20:42 IST
ఢిల్లీ: ముగిసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్ పర్యటన
ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ బయలుదేరిన ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
-
Feb 19, 2026 20:21 IST
బాపట్ల: చీరాల మండలం కొత్తపాలెంలో విషాదం
ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొన్న టాటా ఏసీ వాహనం
సాయిదుర్గ (2) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి
-
Feb 19, 2026 19:59 IST
అనంతపురం: హిందూపురంలో APTS సౌజన్యంతో 6 ఆర్వో వాటర్ ప్లాంట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
-
Feb 19, 2026 19:58 IST
సంగారెడ్డి: జోగిపేట బస్టాండ్‌లో వృద్ధురాలి దగ్గర 16 తులాల బంగారం అపహరించిన దుండగులు
-
Feb 19, 2026 19:54 IST
వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన హోంమంత్రి అనిత
జగన్‌కు ఉన్న రోగం ఏమిటో గూగుల్ కూడా చెప్పలేకపోతోంది
జగన్ మోహన్ రెడ్డి ఒరిజినల్ హ్యాబిట్యుయల్ క్రిమినల్
-
Feb 19, 2026 19:52 IST
రాచకొండలో ఈగిల్ సోదాలు
28 కిలోల గంజాయి స్వాధీనం
కరుడుగట్టిన నేరస్తుడు ఖాజా వాహబుద్దిన్ అరెస్ట్
43 కేసుల్లో నిందితుడుగా ఉన్న ఖాజా వాహబుద్దిన్
రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద కారు డిక్కీలో గంజాయి సీజ్ చేసిన ఈగల్ టీమ్
-
Feb 19, 2026 19:51 IST
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు CEC లేఖ
SIRకి సంబంధించి సన్నాహక పనులను త్వరగా పూర్తిచేయాలని CEC ఆదేశం
-
Feb 19, 2026 19:45 IST
నెల్లూరు: నగరంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు
శివాజీసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభయాత్ర
పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న యువత
నగరంలో మార్మోగిన ‘జై శివాజీ.. జై భవానీ’ నినాదాలు
-
Feb 19, 2026 19:29 IST
2020లో భోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టారు: హోంమంత్రి అనిత
భోలే బాబా అనేవి రెండు వేర్వేరు కంపెనీలు
సక్రమంగా వ్యాపారం చేస్తే ఈ విషయాలు తెలుస్తాయి
రెండు కంపెనీల మధ్య తేడా వైసీపీకి అర్థంకావట్లేదు
తిరుమల లడ్డూలో రసాయనాలు కలవడం వాస్తవం
మీ హయాంలోనే రసాయనాలు కలిసినప్పుడు.. ఆ టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు?
-
Feb 19, 2026 19:28 IST
టీ20 వరల్డ్ కప్: శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం
శ్రీలంక 178/7, జింబాబ్వే 182/4
-
Feb 19, 2026 19:28 IST
డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను నియమించిన ఏపీ ప్రభుత్వం
రిటైర్డ్ IAS రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కమిషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ నిర్థారణకు..
బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్‌కు ఆదేశాలు
45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు
-
Feb 19, 2026 18:37 IST
యూట్యూబర్ నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై నిషేధం
1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్‌ని బ్యాన్ చేసిన యాజమాన్యం
గతంలో భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
ఇన్‌స్టాగ్రామ్ వివరాలు కావాలంటూ యాజమాన్యానికి లేఖ రాసిన సీసీఎస్ పోలీసులు
వివరాలు అందిన వెంటనే చర్యలకు ఉపక్రమించిన సీసీఎస్ పోలీసులు
మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, అకౌంట్‌ను తొలగించాలని కోరిన పోలీసులు
-
Feb 19, 2026 18:29 IST
టీజీఎస్‌పీడీసీఎల్ సంస్థలో 8 మంది ఇంజనర్లను సస్పెండ్ చేసిన యాజమాన్యం.
ఈ 8 మంది ఇంజనీర్లు అవినీతికి పాల్పడ్డట్లు నిర్ధారణ.
వివిధ రూపాల్లో లంచాలు తీసుకున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు.
మొత్తం 8 మంది ADE, AE, సబ్ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు.
-
Feb 19, 2026 18:23 IST
పాకిస్తాన్: కరాచీలో ఓ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్ పేలుడు
మహిళలు, చిన్నారులు సహా 16 మంది మృతి
పేలుడు ధాటికి భవనం కొంతభాగం కూలడంతో ప్రాణనష్టం
-
Feb 19, 2026 18:17 IST
బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ అరెస్టు
పదవీ దుర్వినియోగం ఆరోపణలతో ఆండ్రూ మౌంట్‌బాటన్‌పై చర్యలు
ఎప్‌స్టీన్‌కు కీలకమైన వాణిజ్య నివేదికలు పంపారన్న ఆరోపణలతో విచారణ
ఆండ్రూ మౌంట్‌బాటన్ 2010లో వాణిజ్య నివేదికలు పంపినట్లు ఆరోపణలు
లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ఆండ్రూ నివేదికలు పంపారని ఆరోపణలు
-
Feb 19, 2026 18:16 IST
తమిళనాడు ఎన్నికల్లో కీలక పరిణామం
DMK, DMDK పార్టీల మధ్య కుదిరిన పొత్తు
సీఎం స్టాలిన్ సమక్షంలో నేతల చర్చలు
-
Feb 19, 2026 18:15 IST
కామారెడ్డి: దోమకొండ మండలం ముత్యంపేటలో ఉద్రిక్తత
భారీ బందోబస్తుతో మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత
ప్రభుత్వ పాఠశాల స్థలంలోని 16 షెట్టర్లు కూల్చిన అధికారులు
-
Feb 19, 2026 18:13 IST
UCIL జీఎం సుమన్ సర్కార్‌కు వివేకా కుమార్తె సునీత లేఖ
వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్: సునీత
హత్య కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు: సునీత
ఉదయ్‌కుమార్‌పై శాఖాపరమైన విచారణ జరగాలి: సునీత
-
Feb 19, 2026 16:20 IST
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పు
స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా తమ్మారెడ్డి భారద్వాజ నియామకం
దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భారద్వాజకు బాధ్యతలు
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
Feb 19, 2026 16:16 IST
హైదరాబాద్: కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కేసుల్లో ఇరుక్కున్నారు: కడియం
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు
ప్రజాసమస్యలపై ఎందుకు స్పందించట్లేదు?
-
Feb 19, 2026 16:01 IST
ఢిల్లీ: మంత్రి సీతక్క, రాహుల్ గాంధీ మధ్య సరదా సంభాషణ
మేడారం జాతరకు ఆహ్వానిస్తే హాజరయ్యేవారమన్న రాహుల్, ఖర్గే
వచ్చే జాతరకు అధికారిక ఆహ్వానం అందిస్తామన్న మంత్రి సీతక్క
ఆహ్వానం అందితే తప్పక వస్తామని రాహుల్ గాంధీ, ఖర్గే హామీ
-
Feb 19, 2026 15:38 IST
అమరావతి: కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేశాం: మంత్రి నారాయణ
11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశాము
బ్యాంక్ ఉద్యోగుల నివాసాల కోసం భూ కేటాయింపులు చేశాం
రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్‌కు రెండు ఎకరాలు కేటాయించాం
-
Feb 19, 2026 15:35 IST
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
1,236 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
365 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Feb 19, 2026 14:48 IST
IRR కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు క్లోజ్ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోర్టు నోటీసులు
-
Feb 19, 2026 14:45 IST
ఆదిలాబాద్ జిల్లా జైలుకు హరీష్‌రావు
జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పరామర్శ.
-
Feb 19, 2026 14:42 IST
టీకాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశంపై ఎక్స్‌లో AICC చీఫ్ ఖర్గే పోస్ట్
సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్న ఖర్గే.
పార్టీ ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామన్న ఖర్గే.
సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న ఖర్గే.
-
Feb 19, 2026 14:36 IST
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
900 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్
250 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ
-
Feb 19, 2026 13:48 IST
అన్నమయ్య: బాలిక హత్య కేసు
మార్చురీలోనే నిందితుడు కులవర్ధన్ మృతదేహం
పరారీలో ఉన్న ఏ2 కులవర్ధన్ తల్లి అంజనమ్మ
కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు చెల్లి నిరాకరణ
గుర్తుతెలియని మృతదేహంగా పోలీసుల లుకౌట్ నోటీసులు
మృతదేహం తీసుకెళ్లేందుకు సాయంత్రం వరకు ఎవరూ రాకపోతే..
మున్సిపాలిటీ వారే అంత్యక్రియలు చేయాలని నిర్ణయం
-
Feb 19, 2026 13:07 IST
పంజాబ్ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు
సెక్రటేరియట్‌ను పేల్చేస్తామంటూ ఈ-మెయిల్
పంజాబ్ సెక్రటేరియట్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
-
Feb 19, 2026 12:47 IST
ఢిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి: సీజేఐ
అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలి: సీజేఐ
భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారు: సీజేఐ
ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాలూ ఉచితాలు అమలు చేస్తున్నాయి: సీజేఐ
రెవెన్యూ లోటు కారణంగా అభివృద్ధికి నిధులు సరిపోవు: సీజేఐ
జీతాలు, ఉచితాలకే రాష్ట్రాల ఆదాయం సరిపోతుంది: సీజేఐ
4 వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రం, ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
-
Feb 19, 2026 11:56 IST
ఛత్తీస్‌గఢ్: కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్
భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టుల మృతి
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
మావోయిస్టు అగ్రనేతల ఏరివేతకు ఆపరేషన్ కగార్-2
మావోయిస్టు కార్యదర్శి దేవ్‌జీ టార్గెట్‌గా కూంబింగ్
-
Feb 19, 2026 11:53 IST
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత
ఆర్టీసీలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: కవిత
యూనియన్లపై నిషేధం ఎత్తివేస్తామన్నారు.. ఏమైంది?: కవిత
ఫ్రీ బస్సులు ఎవరి కోసం.. ఎందుకోసం పెట్టారు?: కవిత
ఆర్టీసీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: కవిత
-
Feb 19, 2026 11:33 IST
ఢిల్లీ: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద AI సమ్మిట్: ప్రధాని మోదీ
AI సమ్మిట్ నిర్వహణ భారత్‌కే కాదు.. దక్షిణాసియాకే గర్వకారణం: ప్రధాని మోదీ
కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోంది: మోదీ
ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్ మారింది: ప్రధాని మోదీ
-
Feb 19, 2026 11:13 IST
సూర్యాపేట: స్నేహనగర్ కాలనీలో దారుణం
యువతిపై సుత్తితో దాడి చేసిన యువకుడు
యువతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు
యువతి తనను దూరం పెడుతోందని దాడి చేసిన యువకుడు
-
Feb 19, 2026 11:13 IST
ఢిల్లీ: AICC చీఫ్ ఖర్గేతో టీకాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ
పాల్గొన్న కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
పాల్గొన్న మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్, మంత్రులు
-
Feb 19, 2026 11:12 IST
అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు
ఈనెల 26న విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఇటీవల విచారణకు గైర్హాజరు కావడంతో మరోసారి సమన్లు
-
Feb 19, 2026 10:47 IST
సాక్షి మీడియాకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు లీగల్ నోటీసులు
తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కథనాలు రాస్తున్నారంటూ నోటీసులు
ఇందిరా టెలివిజన్ ఎండీ భారతి రెడ్డి, ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లకు నోటీసులు జారీ
బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రఘురామ డిమాండ్
పరిహారంగా కోటి చెల్లించాలని నోటీసులో పేర్కొన్న డిప్యూటీ స్పీకర్
-
Feb 19, 2026 09:38 IST
హైదరాబాద్: నార్సింగి పీఎస్ పరిధిలో దారుణం
బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేసిన రౌడీషీటర్లు
బాలికను ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం
పరారీలో ఉన్న ముగ్గురు రౌడీషీటర్ల కోసం పోలీసుల గాలింపు
-
Feb 19, 2026 09:28 IST
చర్లపల్లి తల్లీబిడ్డల ఆత్మహత్య కేసు
కేసులో ఎలాంటి అనుమానాలు లేవన్న కుటుంబసభ్యులు
మానసిక ఒత్తిడే కారణమని పోలీసుల అంచనా
ట్రాక్‌పై ముగ్గురే ఉన్నారని లోకో పైలెట్ స్టేట్‌మెంట్
-
Feb 19, 2026 09:27 IST
కర్రెగుట్టలో ఆపరేషన్-2 కగార్ ప్రారంభం
మావోయిస్టు అగ్రనేతలు టార్గెట్‌గా ఆపరేషన్-2 కగార్
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యం
కర్రెగుట్టలో తలదాచుకున్న మావోయిస్టు అగ్రనేతలు
5 వేల మంది CRPF బలగాలతో కూంబింగ్
లొంగుబాటుకు సిద్ధమవుతున్న అగ్రనేతలు
40 రోజులే మిగిలివున్న ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్
-
Feb 19, 2026 08:12 IST
నేడు మంచిర్యాల బంద్‌కు BRS పిలుపు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్‌కు నిరసనగా బంద్
బలవంతంగా బంద్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
-
Feb 19, 2026 08:10 IST
ఇవాళ సాయంత్రం జైపూర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
ఓ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
రేపు జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు
-
Feb 19, 2026 08:09 IST
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ
నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ విచారణ
స్పీకర్ ఎదుట విచారణకు హాజరుకానున్న కడియం
-
Feb 19, 2026 08:08 IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
నేడు కూడా బడ్జెట్‌పై కొనసాగనున్న చర్చ
బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్న చంద్రబాబు
-
Feb 19, 2026 08:05 IST
యూపీ: మధురలో ఘోర ప్రమాదం
అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
ప్రమాదంలో నలుగురు యువకుల మృతి
-
Feb 19, 2026 08:03 IST
హైదరాబాద్: విజయారెడ్డి కుటుంబం ఆత్మహత్య కేసు
కేసులో ఎలాంటి అనుమానాలు లేవని జీఆర్పీ పోలీసులకు కుటుంబసభ్యుల వాంగ్మూలం
ముగ్గురి ఆత్మహత్యలో మరొకరి ప్రమేయం లేదని నిర్ధారణ
రెండు నెలలుగా మానసిక ఒత్తిడికి గురైనట్టు పోలీసుల అంచనా
తాను దూరం అయితే పిల్లలు ఒంటరి అవుతారన్న ఆలోచనతోనే..
కఠిన నిర్ణయం తీసుకున్నట్టు దర్యాప్తులో గుర్తించామన్న జీఆర్పీ పోలీసులు
-
Feb 19, 2026 08:01 IST
ఇవాళ సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్‌లో సిటీ పరేడ్
సా.5 నుంచి 7:20 వరకు సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
పార్క్ హోటల్ కూడలి నుంచి కోస్టల్ బ్యాటరీ వరకూ సిటీ పరేడ్
సిటీ పరేడ్‌లో వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శన
ఏపీకి చెందిన కళాకారులు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్‌సీసీ ప్రదర్శనలు
-
Feb 19, 2026 08:00 IST
గద్వాల: హైవేపై ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా
20 మంది ప్రయాణిలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు
ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు దగ్గర ఘటన
-
Feb 19, 2026 07:39 IST
భూ ప్రకంపనలు
పల్నాడు: వినుకొండలో స్వల్ప భూ ప్రకంపనలు
అర్ధరాత్రి రెండున్నర గంటలకు కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి
-
Feb 19, 2026 07:19 IST
AI సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఢిల్లీ AI సమ్మిట్‌లో పాల్గొననున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఇవాళ AI సమ్మిట్‌లో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
రేపు AI సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఇవాళ AI సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
-
Feb 19, 2026 07:19 IST
ఢిల్లీ: ఇవాళ ఉ.9.40 గంటలకు Ai ఇంపాక్ట్ సమ్మిట్
ఇండియా Ai ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్..
ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్
ఇవాళ రాత్రి 7.30కి ప్రధాని మోదీ విందుకు హాజరుకానున్న సీఎం రేవంత్
Ai సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులతో పాటు..
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విందుకు ఆహ్వానించిన మోదీ
Ai సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Feb 19, 2026 07:17 IST
ఢిల్లీకి మంత్రులు..
ఇవాళ ఉదయం ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇందిరాభవన్‌లో AICC భేటీకి హాజరుకానున్న సీఎం, మంత్రులు
-
Feb 19, 2026 07:17 IST
కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం
ఢిల్లీ: నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఎంపీ రాహుల్ గాంధీ సమావేశం
హాజరుకానున్న సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
-
Feb 19, 2026 07:15 IST
ఆదిలాబాద్‌కు హరీష్‌రావు
నేడు ఆదిలాబాద్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు
జైలులో బాల్క సుమన్‌ను కలవనున్న హరీష్‌రావు