వినుకొండలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
ABN , Publish Date - Feb 19 , 2026 | 08:00 AM
పల్నాడు జిల్లా వినుకొండలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో వినుకొండతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది.
పల్నాడు జిల్లా: వినుకొండలో భూ ప్రకంపనలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో వినుకొండ (Vinukonda)తో పాటు నడిగడ్డ, దర్శి పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఏం జరుగుతుందో అని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది.
భూకంప కేంద్రం వినుకొండకు వాయవ్య దిశలో 20 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ధ్రవీకరించింది. అదృష్టవశాత్తూ ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సంబంధిత అధికారులు చెప్పారు.