Share News

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు.. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడి అరెస్ట్

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:29 PM

కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఓ బాధితురాలు.. మాజీ ప్రిన్స్ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేసింది. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు ఆండ్రూ మూడు సార్లు లైంగికదాడి చేశారని అరోపించింది..

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు.. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడి అరెస్ట్
Andrew Mountbatten-Windsor

ఇంటర్‌నెట్ డెస్క్: ఎప్‌స్టీన్స్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ ఫైళ్లలో బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడు, మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండర్స్ పేరు కూడా ఉంది. ఈ విషయం యూకేలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ గురించి పోలీసులు ఓ ప్రకటన చేశారు.


అయితే, ఆండ్రూ పేరును బయటకు చెప్పలేదు. పదవీ దుర్వినియోగం ఆరోపణల కింద ఓ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా, కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఓ బాధితురాలు ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేసింది. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు ఆండ్రూ మూడు సార్లు లైంగికదాడి చేశారని అంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆండ్రూ రాయల్ టైటిల్‌ను వదులుకున్నారు. అంతేకాదు.. అన్ని రాజ బిరుదులు, గౌరవాలు, అధికారాలను సైతం కోల్పోయారు.


ఇవి కూడా చదవండి..

హెరిటేజ్‌‌పై వ్యతిరేక కథనాలను తొలగించాలి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..

Updated Date - Feb 19 , 2026 | 05:44 PM