Share News

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:57 PM

విశాఖపట్నంలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..
Rayapati Sailaja

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో జరిగిన ఓ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ( Rayapati Sailaja) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల వయసున్న పసికందుపై జరిగిన లైంగిక దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు నాగరిక సమాజానికి మచ్చ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రాయపాటి శైలజ విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌‌తో ఫోన్‌లో మాట్లాడారు.


ఈ కేసు దర్యాప్తు పురోగతిని, నిందితుల వివరాలను రాయపాటి శైలజ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. చిన్నారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో నిందితులకు చట్టప్రకారం అత్యంత కఠిన శిక్షపడేలా.. మహిళా కమిషన్ పక్షాన పర్యవేక్షిస్తామని రాయపాటి శైలజ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 05:41 PM