Share News

హెరిటేజ్‌‌పై వ్యతిరేక కథనాలను తొలగించాలి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:26 PM

సాక్షి మీడియాపై హెరిటేజ్‌ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వైసింది. సాక్షి మీడియాపై రూ.వంద కోట్లకు హెరిటేజ్‌ సంస్థ దావా వేసింది..

హెరిటేజ్‌‌పై వ్యతిరేక కథనాలను తొలగించాలి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..
Delhi High Court

ఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సాక్షి మీడియాపై హెరిటేజ్‌ (Heritage) సంస్థ.. ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) పరువు నష్టం దావా వైసింది. సాక్షి మీడియాపై రూ.వంద కోట్లకు హెరిటేజ్‌ సంస్థ దావా వేసింది. హెరిటేజ్‌‌పై ప్రచురించిన వ్యతిరేక కథనాలను వెంటనే తొలగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కథనాలతో పాటు ప్రసారాల వీడియో లింక్‌లను కూడా తొలగించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. హెరిటేజ్‌కు వ్యతిరేకంగా ఎవరైనా రాసి ఉంటే.. వాటినీ తొలగించాలని హుకుం జారీ చేసింది. తమ ఆదేశాలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 05:29 PM