Share News

సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. తనని దూరం పెడుతోందని..

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:49 PM

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఒక ఉన్మాది రెచ్చిపోయి, యువతిపై అత్యంత క్రూరంగా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. తనని దూరం పెడుతోందని..
Suryapet Crime News

సూర్యాపేట, ఫిబ్రవరి 19: సూర్యాపేటలోని స్నేహ నగర్ కాలనీలో దారుణ సంఘటన జరిగింది. ప్రేమ పేరుతో యువకుడు రెచ్చిపోయాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. అయితే, సదరు యువతి అతడిని దూరం పెడుతుండటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇవాళ (గురువారం) యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై సుత్తెతో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తలకు తీవ్ర గాయాలై యువతి స్పృహ కోల్పోయింది.


యువతిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కి తరలించారు. నిందితుడిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికులను శాంతింపజేశారు. నిందితుడిపై హత్యాయత్నం, వేధింపులు వంటి సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

For More National News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 01:44 PM