మధురలో విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురి మృతి
ABN , Publish Date - Feb 19 , 2026 | 08:35 AM
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మధురలోని మాగోర్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని మధుర జిల్లా మాగోర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువ(canal)లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను రాహుల్(23), అమిత్ (22), మోహిత్(22), మరో వ్యక్తిని వారి స్నేహితుడిగా గుర్తించారు. వీరంతా రాజస్థాన్(Rajasthan)లోని డీగ్ కు ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రూరల్ ఎస్పీ సురేశ్ మాట్లాడుతూ.. ‘నలుగురు యువకులు మహావన్ నుంచి డీగ్ కు బైపాస్ ద్వారా గోవర్ధన్ మీదుగా కారులో ప్రయాణిస్తున్నారు. మలుపు తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి లోతైన కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురూ చనిపోయారు. క్రేన్(Crane) సహాయంతో కారును వెలికితీసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రమాదకర కత్తులు అమ్మిన బ్లింకిట్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..
టీ20 ప్రపంచ కప్: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. లైవ్ అప్‌డేట్స్