Share News

మోదీతో ఏఐ ఫోటోను షేర్ చేసిన మెక్రాన్

ABN , Publish Date - Feb 18 , 2026 | 09:17 PM

భారత్-ఫ్రాన్స్ మధ్య పెరుగుతున్న మైత్రీబంధాన్ని గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీతో తాను కలిసి ఉన్న ఏఐ-ఫోటోను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బుధవారంనాడు షేర్ చేశారు.

మోదీతో ఏఐ ఫోటోను షేర్ చేసిన మెక్రాన్
PM Modi with Mecron

న్యూఢిల్లీ: భారత్-ఫ్రాన్స్ మధ్య పెరుగుతున్న మైత్రీబంధానికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీతో తాను కలిసి ఉన్న ఏఐ-ఫోటోను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) బుధవారంనాడు షేర్ చేశారు. భారత్‌-ఫ్రాన్స్ మధ్య మైత్రీబంధాన్ని 'ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఏఐ-జనరేటెట్ ఫోటోను షేర్ చేయడం ద్వారా మోదీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మెక్రాన్ చాటుకున్నారు.


'వెన్ ఫ్రెండ్స్ కనెక్ట్, ఇన్నొవేషన్ ఫాలోస్. ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు రెడీ' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మెక్రాన్ రాసుకొచ్చారు.


మెక్రాన్, ఫస్ట్ లేడీ బ్రిగెట్టె మెక్రాన్‌లు ముంబైలో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా మోదీ, మెక్రాన్‌లు మంగళవారంనాడు ముంబైలో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ముంబై పర్యటనలో భాగంగా బాలీవుడ్ సినీ ప్రముఖులతోనూ మెక్రాన్ సమావేశమయ్యారు. ఢిల్లీలో భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కూడా మెక్రాన్ పాల్లోనున్నారు. ఆయనతో పాటు 20కి పైగా ప్రపంచాధినేతలు ఈ సమిటిల్‌ పాల్గొంటున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇండియా ఏఐ సమ్మిట్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. మరో రోజు పొడిగింపు..

ఏఐ సమిట్‌లో ఊహించని పరిణామం.. అది చైనా రోబో డాగ్.. ఇండియాది కాదు..

Updated Date - Feb 18 , 2026 | 09:26 PM