నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 16 , 2026 | 07:03 AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   1/16

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   2/16

మంగళవారం సాయంత్రం 6.21- 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   3/16

వేద ఘోష మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా బంగారు ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేసిన అర్చక బృందం.. సకల దేవతామూర్తులు, అష్టదిక్పాలకులకు ఆహ్వానం పలికింది.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   4/16

సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పెద్దశేష వాహనంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   5/16

సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌ దంపతులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి విశ్రాంతి భవనానికి చేరుకుని కొంతసమయం విశ్రాంతి తీసుకున్నారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   6/16

అనంతరం సంప్రదాయ వస్త్రధారణతో తొలుత బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   7/16

అక్కడ అర్చకులు చంద్రబాబు తలకు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపజేశారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   8/16

ఆ తర్వాత నూతన పట్టువస్త్రాలను సీఎం చంద్రబాబు తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని వస్త్రసమర్పణ చేశారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   9/16

తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారు

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   10/16

అక్కడినుంచి వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తులను సీఎం కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   11/16

అనంతరం టీటీడీ ముద్రించిన 2027 నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను సీఎం ఆవిష్కరించారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   12/16

దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలని, ఆయన సాన్నిధ్యంలో కొంత సమయం గడపాలని ఆశిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   13/16

భక్తులందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించే విధంగా పాలకమండలి, టీటీడీ సిబ్బంది పనిచేయాలని సీఎం చంద్రబాబు కోరారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   14/16

ముఖ్యమంత్రిగా 15వ సారి వచ్చి ప్రభుత్వం తరఫున లాంఛనాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   15/16

రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందుండి నడిపించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.

నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు   16/16

మంత్రి నారా లోకేశ్‌కు బొట్టు పెడుతున్న బ్రాహ్మణులు.

Updated at - Sep 16 , 2026 | 07:27 AM