పశ్చిమాసియా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం: కేంద్రమంత్రి జై శంకర్
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:57 AM
పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు.
ఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ (Union Minister Jaishankar) రాజ్యసభలో ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పచ్చిమాసియా దేశాల్లోని భారతీయులను కేంద్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందని చెప్పుకొచ్చారు.
క్రూడ్ ఆయిల్ పరిస్థితిపై అప్రమత్తం..
గల్ఫ్ దేశాలు భారత్‌కి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయని కేంద్ర మంత్రి జై శంకర్ వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారతీయుల కోసం ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయని వివరించారు. క్రూడ్ ఆయిల్ పరిస్థితిపై కేంద్రప్రభుత్వం అప్రమత్తంగా ఉందని అన్నారు. భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. టెహ్రాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
చర్చలు జరుపుతున్నాం..
గల్ఫ్ దేశాల ప్రభుత్వాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతుందని కేంద్ర మంత్రి జై శంకర్ తెలిపారు. భారత విమానయాన సంస్థలు భారత ప్రజలను వెనక్కు తీసుకువస్తున్నాయని అన్నారు. ఇండియా రావాలనుకునేవారికి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దోహా, జోర్డాన్‌లో ఉన్నవారికి సాయం అందజేస్తున్నామని ప్రకటించారు. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో అక్కడి పరిస్థితులపై మాట్లాడామని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్
Read Latest International News And Telangana News And AP News And Telugu News