Share News

కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ.. ఎందుకంటే..

ABN , Publish Date - Apr 17 , 2026 | 09:11 PM

కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం ఉదయం 11:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ.. ఎందుకంటే..
Union Cabinet Meeting

ఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ వేదికగా రేపు(శనివారం) జరగనున్న కేంద్ర కేబినెట్ (Union Cabinet Meeting) అత్యవసర భేటీ యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కేబినెట్ అజెండా..గోప్యత వెనుక కీలక అంశాలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు(శనివారం) ఉదయం 11:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈసారి ప్రత్యేక పరిస్థితుల మధ్య శనివారం జరగనుండటం, అది కూడా 'అత్యవసర' భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ప్రభుత్వం అధికారికంగా అజెండాను వెల్లడించనప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరాన్ తన అధీనంలోని హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచిన నేపథ్యంలో, ప్రపంచ ఇంధన మార్కెట్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చమురు సరఫరా పునరుద్ధరణ నేపథ్యంలో భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలకు కలిగే ఆర్థిక వెసులుబాటుపై చర్చించనున్నారు.


వ్యూహాత్మక నిర్ణయాలు..

పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారత విదేశాంగ, వాణిజ్య విధానాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కొన్ని కీలకమైన ఆర్థిక సంస్కరణల (Economic Reforms) పై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల స్టాక్ మార్కెట్, పారిశ్రామిక వర్గాలు ఈ భేటీ ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి.


కీలక బిల్లులు, ఆర్డినెన్స్‌లు

రాబోయే పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని లేదా అత్యవసరంగా అమలు చేయాల్సిన కొన్ని కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి అత్యవసర భేటీల్లోనే ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన నిర్ణయాలకు పునాది వేసిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. భారతదేశ ఆర్థిక స్థితిగతులను, అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేసే నిర్ణయాలు రేపటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో, దేశవ్యాప్తంగా అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది. శనివారం మధ్యాహ్నం లోపు ఈ భేటీకి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు ఛాన్స్..

మహిళా రిజర్వేషన్ బిల్లులో ముడిపడిన మూడు బిల్లులపై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం సాయంత్రం ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై ఈ ఓటింగ్‌ జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అయితే రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 09:25 PM