కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. గుంతకల్లు-బళ్లారి 3, 4వ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:41 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ, జులై 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారి - ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి రూ.1,264 కోట్లతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు.
వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో సుమారు 80 శాతం ఇప్పటికే అందుబాటులో ఉందని, మూడేళ్లలో పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 99 గ్రామాలకు రైల్వే అనుసంధానం లభిస్తుందని వెల్లడించారు. రైల్వే సామర్థ్యం పెంపు, రద్దీ తగ్గింపే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే, రూ.3,030 కోట్లతో ‘భవ్య రసాయన’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి...
ఉద్యోగ, ఉపాధికి దగ్గరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలి: మహేష్ గౌడ్
Read Latest National News And AP News And Telugu News