Share News

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్‌.. ఆరుగురి మృతి

ABN , Publish Date - May 15 , 2026 | 05:53 PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునీరాబాద్ సమీపంలో బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి కిందపడటంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్‌.. ఆరుగురి మృతి
Karnataka Road Accident

ఇంటర్నెట్ డెస్క్, మే 15 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Karnataka Road Accident) జరిగింది. మునీరాబాద్ సమీపంలో బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి కిందపడటంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న వారు ఓ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్‌ కిందకు పడిపోయిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 06:16 PM