28న మదురైలో ‘మేనమామ ఉంగరం పథకం’
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:42 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే పసిపిల్లల కోసం అమలు చేయనున్న మేనమామ బంగారు ఉంగరం కానుక పథకం ప్రారంభోత్సవం మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
రాజాజీ ఆస్పత్రిలో ప్రారంభించనున్న సీఎం
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే పసిపిల్లల కోసం అమలు చేయనున్న మేనమామ బంగారు ఉంగరం కానుక పథకం ప్రారంభోత్సవం మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ పథకం ప్రారంభోత్సవాన్ని ఉసిలంపట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో జరపాలని నిర్ణయించామని, భద్రత తదితర కారాణాల దృష్ట్యా ప్రారంభోత్సవ స్థలాన్ని మార్చినట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే పసికందులకు మేనమామ బంగారు ఉంగరం పథకం కింది గ్రాము బరువున్న ఉంగరాన్ని కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు.
ఈ పథకం జూన్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో జన్మించిన పసికందులకు కూడా వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.. తొలుత ఈ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి దివంగత అన్నాదురై జయంతి రోజైన ఈ నెల 15 ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఈ నెల 25న ఈ పథకం ప్రారంభమవుతుందని, చివరగా ఈ నెల 28న ఈ పథకాన్ని మదురై సమీపం ఉసిలంపట్టిలో ప్రారంభించాలని అనుకున్నారు. పసికందులకు పంపిణీ చేయడానికి తెప్పించిన వెయ్యికి పైగా బంగారు ఉంగరాలను మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రి, తిరుమంగళం, ఉసిలంపట్టి, మేలూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రపరించారు.
ఆలోగా భద్రతా కారణాల దృష్ట్యా ఈ పథకాన్ని మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28న ఆ ఆసుపత్రి వద్ద ముఖ్యమంత్రి విజయ్ 50 మంది పసిపిల్లలకు బంగారు ఉంగరాలను పంపిణీ చేయనున్నారు. అదే రోజు మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జన్మించే పసికందులకు కూడా ఆయన బంగారు ఉంగరాలను తొడగనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాహుల్ గాంధీ vs అఖిలేష్ యాదవ్..
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం..
Read Latest AP News And Telangana News And International News And Telugu News