రాహుల్ గాంధీ vs అఖిలేష్ యాదవ్.. యూపీ ఎన్నికల ముందు కూటమికి కొత్త సవాల్..
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:03 PM
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య కూటమి రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య కూటమి రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రెండు పార్టీల అగ్రనేతలు కూటమి కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ.. దిగువ స్థాయి, ద్వితీయ శ్రేణి నేతల పరస్పర వ్యాఖ్యలు మాత్రం కొత్త చర్చకు దారితీస్తున్నాయి (UP Elections 2027).
తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్, అఖిలేష్ యాదవ్‌ను కూటమికి కీలక నేతగా పేర్కొనగా.. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ రాహుల్ గాంధీ పాత్రను ప్రస్తావించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ మంగళవారం మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో అఖిలేష్ యాదవ్ కీలక పాత్ర పోషించగలరని అన్నారు. కాంగ్రెస్ స్వంతంగా పెద్దగా సాధించేది ఏమీ ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తే తమ బలం మరింత పెరుగుతుందని కూడా ఆమె పేర్కొన్నారు (Rahul Gandhi, Akhilesh Yadav).
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్, రాహుల్ గాంధీ పాత్రను ప్రస్తావించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీదే కీలక పాత్ర అని అన్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న మసూద్.. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇరు పార్టీల అగ్రనేతలు ఐక్యంగానే ఉన్నప్పటికీ.. స్థానిక నేతల వ్యాఖ్యల్లో మాత్రం భిన్నమైన రాజకీయ సందేశాలు కనిపిస్తున్నాయి (SP Congress Alliance).
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి (Uttar Pradesh Assembly Elections). రెండు పార్టీలు కలిపి 43 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ 37, కాంగ్రెస్ 6 స్థానాలు సాధించాయి. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయనున్నట్లు ఇరు పార్టీలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇంకా స్పష్టమైన ఒప్పందం కుదరలేదు.
ఇవి కూడా చదవండి..
భార్య, ఇద్దరు పూజారులను చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌లో మరణించాడు..
రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్..