ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి: మంత్రి అచ్చం నాయుడు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:52 PM
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు సూచించారు.
అమరావతి, సెప్టెంబరు 23: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు సూచించారు. గాలులు, వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు కూలినా లేదా ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించేలా APEPDCL సిబ్బందిని సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని చెప్పారు. అలాగే కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దని మంత్రి అచ్చం నాయుడు కోరారు. ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇవిగో కంట్రోల్ రూమ్ నంబర్లు
టోల్ ఫ్రీ - 1912
కార్పొరేట్ ఆఫీస్ - 8331018762
శ్రీకాకుళం - 9701400865
టెక్కలి - 9490610050
పలాస - 08945241084
పాలకొండ - 8332843546
పార్వతీపురం - 9398594750
విజయనగరం టౌన్ & రూరల్ - 9490610102
బొబ్బిలి - 9490610121
విశాఖ జోన్-1 - 9490610019
విశాఖ జోన్-2 - 9849628880
విశాఖ జోన్-3 - 9491030722
అనకాపల్లి - 9490610023
కశింకోట - 8333810597
నర్సీపట్నం - 9491030723
పాడేరు - 9490610027
కాకినాడ - 9490610856
పెద్దాపురం - 9493178728
జగ్గంపేట - 9490610097
రాజమహేంద్రవరం టౌన్ - 9490610855
రాజమహేంద్రవరం రూరల్ - 9490610859
నిడదవోలు - 9493177540
అమలాపురం - 9490610101
కొత్తపేట - 9493178821
రంపచోడవరం - 8309771508
ఏలూరు - 9440904037
జంగారెడ్డిగూడెం - 9491030712
భీమవరం - 9490610143
తాడేపల్లిగూడెం - 9493177806
నరసాపురం - 7382050943
ఈ వార్తలూ చదవండి
తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
భారీ వర్షాలు.. ఆర్టీసీ అధికారులకు మంత్రి మండిపల్లి ఆదేశాలివే