ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ జుకర్‌బర్గ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:54 PM
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM), డీప్‌ఫేక్‌ల వ్యాప్తి, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన తప్పిదాలపై మెటా విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే.. కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్ చేసేందుకు భారీగా డబ్బులు తీసుకున్నట్లు మెటా బృందం అంగీకరించిందని కొన్ని వర్గాలు తెలిపినట్లు పీటీఐ కథనం పేర్కొంది. ఈ వ్యవహారంపై మెటా క్షమాపణలు చెప్పడంతో పాటు తమ ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లను కూడా మెటా అంగీకరించినట్లు తెలుస్తోంది.
కాగా.. ప్రధాని మోదీకి సంబంధించిన జులై 23 నాటి వీడియోను తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటాను పార్లమెంటరీ కమిటీ బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు దిగొచ్చిన మెటా.. మోదీని క్షమాపణలు చెప్పింది.
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు