Share News

కర్ణాటకలో ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. అక్కడికక్కడే ఆర్టీసీ డ్రైవర్ మృతి

ABN , Publish Date - Sep 09 , 2026 | 08:09 PM

ఐరన్ రాడ్లను తరలిస్తున్న ట్రాక్టర్‌ను కర్టాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

కర్ణాటకలో ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. అక్కడికక్కడే ఆర్టీసీ డ్రైవర్ మృతి
Bus Crashes

బెంగళూరు, సెప్టెంబరు 9: కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఐరన్ రాడ్లను తరిలిస్తున్న ట్రాక్టర్‌ను ఈ రోజు(బుధవారం) ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, సుమారు 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.


మండ్యలోని వరాహసాంద్ర గేట్ వద్ద ఐరన్ రాడ్లతో వెళ్తున్న ట్రాక్టర్‌ను బస్సు వేగంగా ఢికొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఆ రాడ్లు బస్సులోకి చొచ్చుకుపోయాయి. ఇవి నేరుగా డ్రైవర్‌కు గుచ్చుకోవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా మరణించిన డ్రైవర్‌ను శేఖర్‌గా పోలీసులు గుర్తించారు.


ఇవీ చదవండి:

రోడ్డు యాక్సిడెంట్‌లో యువతి మరణం.. 26 రోజుల తర్వాత బయటపడ్డ ట్విస్ట్..

కొడుకు అనారోగ్యాన్ని తట్టుకోలేక.. తల్లి బలవన్మరణం

Updated Date - Sep 09 , 2026 | 09:25 PM