మెడికల్ బిల్లు నుంచి పెళ్లి, చదువు వరకు.. పీఎఫ్ అడ్వాన్స్‌ను ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే..
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:46 PM
ఉద్యోగుల భవిష్యనిధి డబ్బు సాధారణంగా రిటైర్‌మెంట్ కోసం దాచుకునేదే. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆ మొత్తంలో కొంత భాగాన్ని ముందుగానే తీసుకునే అవకాశం ఉంది. తాజాగా ఈపీఎఫ్‌ఓ విత్‌డ్రా నిబంధనలను మరింత సులభతరం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్యనిధి (EPF) డబ్బు సాధారణంగా రిటైర్‌మెంట్ కోసం దాచుకునేదే. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆ మొత్తంలో కొంత భాగాన్ని ముందుగానే తీసుకునే అవకాశం ఉంది. తాజాగా ఈపీఎఫ్‌ఓ విత్‌డ్రా నిబంధనలను మరింత సులభతరం చేసింది. అనారోగ్యం, విద్య, వివాహం, ఇల్లు వంటి అవసరాల కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే విధానాన్ని మూడు ప్రధాన కేటగిరీలుగా మార్చింది (New EPF Withdrawal Rules 2026).
అనారోగ్యం: వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వైద్య చికిత్సల కోసం చందాదారుడు తన సర్వీసులో ఎన్ని సార్లైనా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు (PF Withdrawal for Medical).
విద్య: వ్యక్తిగత, కుటుంబ సభ్యుల చదువు కోసం మొత్తం సర్వీసులో పది సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు (PF Withdrawal for Education).
వివాహం: వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివాహ ఖర్చుల నిమిత్తం మొత్తం సర్వీసులో ఐదుసార్లు విత్ డ్రా చేసుకోవచ్చు (PF Withdrawal for Marriage).
ఇంటికి సంబంధించిన అవసరాలు: ఇల్లు, భూమి కోనుగోలు, గృహ నిర్మాణం, గృహ రుణం చెల్లింపు, ఇంటి మరమ్మతుల కోసం మొత్తం సర్వీసులో ఐదుసార్లు విత్ డ్రా చేసుకోవచ్చు (EPF Housing Withdrawal).
ప్రత్యేక పరిస్థితులు: ప్రకృతి విపత్తులు, ఉద్యోగం కోల్పోవడం, రోగాల వ్యాప్తి వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ సభ్యత్వం 12 నెలలు దాటిన తర్వాత చందాదారులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ నుంచి 75 శాతం వరకు నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఖాతాలో 25 శాతం కనీస నిల్వ ఉంచి మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకోగలరు. ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈపీఎఫ్‌ఓ అధికారిక వివరణ ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో 75 శాతం పీఎఫ్ బ్యాలెన్స్‌ను వెంటనే తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని ఒక సంవత్సరం తర్వాత తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..