Share News

కొడుకు అనారోగ్యాన్ని తట్టుకోలేక.. తల్లి బలవన్మరణం

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:23 AM

కన్నకొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది.. బిడ్డ ఆరోగ్యం బాగుపడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె.. చివరికి ఊహించని నిర్ణయం తీసుకుంది. పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది..

కొడుకు అనారోగ్యాన్ని తట్టుకోలేక.. తల్లి బలవన్మరణం
Kamareddy Tragedy

కామారెడ్డి, సెప్టెంబర్ 9: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల స్రవంతి.. తన కొడుకు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న ఆమె.. పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్రవంతి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. స్రవంతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొడుకు అనారోగ్యం కారణంగానే ఆమె మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుందా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

20 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో పది క్రేజీ థింగ్స్.. వీడియో వైరల్

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..

Updated Date - Sep 09 , 2026 | 11:27 AM