Share News

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:51 PM

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూసిన అతడికి దిమ్మతిరిగినంత పనైంది.

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..
Online Food Delivery Issue

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూసిన అతడికి దిమ్మతిరిగినంత పనైంది. నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పోస్టును నెట్టింట షేర్ చేశాడు.

ఇటీవల ఓ రోజు రాత్రి 10.30 గంటలకు యాప్ ద్వారా ఫుడ్ ఆర్డరిచ్చినట్టు అతడు చెప్పుకొచ్చాడు. అయితే, డెలివరీ ఏజెంట్ తన ఇంటి సమీపానికి వచ్చినట్టు యాప్‌లో కనిపించినా ఫుడ్ మాత్రం డెలివరీ కాలేదని చెప్పాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఇలా ఎదురు చూశాక చివరకు విసుగొచ్చి తానే స్వయంగా డెలివరీ ఏజెంట్ వద్దకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.


యాప్‌లోని లొకేషన్ ఆధారంగా డెలివరీ ఏజెంట్ వద్దకు వెళ్లి చూడగా అక్కడ తన ఫుడ్ మరో ఇద్దరు తింటూ కనిపించినట్టు చెప్పాడు. తన ఫుడ్‌ను ఏజెంట్ మరో ఇద్దరికి విక్రయించినట్టు తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించి ఫొటోలు కూడా షేర్ చేశారు. సంబంధిత కంపెనీ వారిని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు కూడా చేశాడు. ఇది ఫుడ్ డెలివరీనా? ఫుడ్ షేరింగా? అని ప్రశ్నించాడు.

ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రాత్రి వేళ ఫుడ్ ఆర్డర్స్‌ పెట్టడంపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇలాంటి సమయాల్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలని సూచించారు. ముందస్తు చెల్లింపులు వద్దని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నదిలోకి దూకిన యువతి.. చివరగా ఏం చెప్పిందంటే..

మేనకోడలి కోసం రూ.3.85 కోట్లు పెట్టి డేగను కొన్న అరబ్ వ్యక్తి

Updated Date - Sep 07 , 2026 | 02:04 PM