Share News

ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నదిలోకి దూకిన యువతి.. చివరగా ఏం చెప్పిందంటే..

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:10 PM

ఫోన్‌ కాల్‌లో ఉన్న తండ్రికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఓ యువతి నదిలోకి దూకిన సంఘటన జమ్ముకశ్మీర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నదిలోకి దూకిన యువతి.. చివరగా ఏం చెప్పిందంటే..
Doda Chenab River Incident

ఇంటర్‌నెట్ డెస్క్: ఫోన్‌ కాల్‌లో ఉన్న తండ్రికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఓ యువతి నదిలోకి దూకిన సంఘటన జమ్ముకశ్మీర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. దొడ జిల్లాలోని ప్రేమ్ నగర్‌కు చెందిన పాయల్ దేవి ఆదివారం మధ్యాహ్నం స్థానికంగా జరిగిన ఓ మేళాకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తండ్రికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, డాక్టర్‌ను కలవడానికి వెళుతున్నానని చెప్పింది. ఆస్పత్రి దగ్గర డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో బైకుపై ఇంటికి తిరుగుప్రయాణం అయింది.


మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బైకు చినాబ్ నదిపై ఉన్న బ్రిడ్జి మీదకు వచ్చింది. పాయల్ బైక్ ఆపమని బైక్ నడుపుతున్న వ్యక్తికి చెప్పింది. అతడు బైక్ ఆపాడు. పాయల్ బైక్ మీద నుంచి కిందకు దిగి, బ్రిడ్జి రెయిలింగ్ వద్దకు పరిగెత్తింది. రెయిలింగ్‌ను దాటి అవతలికి చేరింది. బైక్ డ్రైవర్ ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. దగ్గరకు వస్తే నదిలో దూకేస్తానని ఆమె బెదిరించింది. ఆ వ్యక్తి పాయల్ తండ్రికి ఫోన్ చేశాడు. ఆయన పాయల్‌తో మాట్లాడాడు.


కూతురిని నీటిలో దూకకుండా ఆపడానికి చాలా ప్రయత్నించాడు. అయినా ఆమె వినలేదు. ‘లేదు నాన్న, ఇది నా జీవితం. నేను ఇలానే వెళ్లిపోవాలని నా మనసు చెబుతోంది’ అని చెప్పింది. కొన్ని సెకన్ల తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ‘బై బై పాప’ అని నదిలోకి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ పాయల్ కోసం నదిలో అన్వేషిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాయల్ నీటిలో దూకడానికి కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు.


ఇవి కూడా చదవండి

డొనాల్డ్ ట్రంప్ మరో పోస్టు.. ఆ రాష్ట్రం పేరునూ మార్చేస్తారా?

రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత

Updated Date - Sep 07 , 2026 | 01:14 PM