Share News

శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్న అధికారులు..

ABN , Publish Date - Sep 09 , 2026 | 07:27 PM

శ్రీశైల క్షేత్రంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బందితో ఈవో శ్రీనివాసరావు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.

శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్న అధికారులు..
Srisailam Temple

కర్నూలు జిల్లా: శ్రీశైల క్షేత్రంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బందితో ఈవో శ్రీనివాసరావు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.


ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించనున్న నవదుర్గ అలంకరణలు, వాహనసేవలు, శమీపూజ తదితర కార్యక్రమాలపై చర్చించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, క్యూలైన్లు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఈవో సూచించారు. అలాగే దసరా ఉత్సవాలను భక్తులు సులభంగా వీక్షించేలా ఆలయ ముఖ్య ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.


ఉత్సవాల సందర్భంగా దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. దసరా మహోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహోత్సవాల ఏర్పాట్లన్నింటినీ నిర్ణీత గడువులోగా పగడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

వినాయక విగ్రహం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

అటుకులను ఇలా తింటే మరింత ఆరోగ్యం..!

Updated Date - Sep 09 , 2026 | 07:53 PM