Share News

ఇండిగో విమానంలో మంటలు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , Publish Date - Oct 11 , 2026 | 07:14 PM

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది సమయానికి మంటలను అదుపుచేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇండిగో విమానంలో మంటలు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
fire broke out delhi chennai flight

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ-చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది సమయానికి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి చెన్నై ప్రయాణించే ఇండిగో విమానం అక్టోబర్ 11 ఆదివారం మధ్యాహ్నం 1.10 నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా.. 20 నిమిషాల ఆలస్యంతో 1.30 నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరింది. సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నై చేరుకోవాల్సిన ఈ విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు రావడం గమనించిన సిబ్బంది.. అప్రమత్తమై చాకచక్యంగా మంటలను ఆపివేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు వేరే విమానంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చారు.


ఈ వార్తలూ చదవండి

బీసీసీఐకి గంభీర్‌ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!

ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు

Updated Date - Oct 11 , 2026 | 07:21 PM