Share News

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి సమావేశం.. శరద్ పవార్ పార్టీ గైర్హాజరు

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:58 PM

డీలిమిటేషన్ బిల్లుపై వ్యూహరచనకు ఇండియా కూటమి ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. శరద్ పవార్ పార్టీ ఈ భేటీకి గైర్హాజరైంది.

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి సమావేశం.. శరద్ పవార్ పార్టీ గైర్హాజరు
INDIA bloc Delimitation

ఢిల్లీ, నవంబర్ 28: నవంబర్ 30న ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అడ్డుకునేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఇవాళ శనివారం ఢిల్లీలో ఇండియా (INDIA) కూటమి పక్షాల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. అయితే, సవరించిన డీలిమిటేషన్ ప్రతిపాదనలకు ఇప్పటికే మద్దతు సూచించిన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఈ సమావేశానికి గైర్హాజరు కావడం కూటమిలో చీలికను స్పష్టం చేసింది. (INDIA bloc Delimitation)


సమావేశానికి హాజరైన నేతలు, దూరమైన పార్టీలు

ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ తరపున కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, సయ్యద్ నసీర్ హుస్సేన్, పవన్ ఖేరా పాల్గొనగా, మిత్రపక్షాల నుంచి సీపీఎం నేత ఏ. రహీం, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్.కె. ప్రేమచంద్రన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత చౌదరి మహ్మద్ రంజాన్, ఆర్జేడీ నేతలు అభయ్ కుష్వాహా, మనోజ్ ఝా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, ఐయూఎంఎల్ నేత ఇ.టి. మహ్మద్ బషీర్, శివసేన (యూబీటీ) నేత అరవింద్ సావంత్, సీపీఐ నేత పి. సంతోష్, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ హాజరయ్యారు. జేఎంఎం నేత బైద్యనాథ్ రామ్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.


ఇప్పటికే ఇండియా కూటమికి దూరంగా జరుగుతున్న డీఎంకే (22 ఎంపీలు) ఎన్సీపీ-ఎస్పీ (8 ఎంపీలు) ఈ బిల్లుకు అనుకూలంగా సంకేతాలు ఇవ్వడం విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బగా మారింది.

బీజేపీపై కాంగ్రెస్ నేతల తీవ్ర ఆరోపణలు

బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందని, మహిళా రిజర్వేషన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ఆరోపించారు. ఈడీ (ED), సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల భయంతో విపక్ష నేతలను లొంగదీసుకుని కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ 'ఆపరేషన్ లోటస్' తరహా కుట్రలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!

కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 01:00 PM