Share News

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం.?

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:11 AM

బాలీవుడ్ నటుడు, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ముంబై నిరసనల్లో పాల్గొన్న నేపథ్యంలో పోలీసుల నోటీసులు అందినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 28లోగా భారత్ విడిచి వెళ్లాలని అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం.?

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్‌ నటుడు, ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు వ్యతిరేకంగా ముంబైలో చేపట్టిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు ఆయనకు పోలీసుల నుంచి నోటీసులు జారీ అయినట్టు సమాచారం. ఈ నెల 28లోగా ఆయన భారత్ విడిచి వెళ్లాలంటూ అందులో పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.


ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌ వద్ద ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌ పాల్గొన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.


కాగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికా పౌరసత్వంతో పాటు ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఓసీఐ కార్డు ద్వారా భారత్‌లో నివసించడం సహా నిబంధనలకు లోబడి పలు సదుపాయాలు పొందవచ్చు. అయితే.. ఇది భారత పౌరసత్వంతో సమానం కాదు. విదేశీ పౌరులు, ఓసీఐ కార్డుదారులకు వర్తించే నిబంధనల నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ నిరసనల్లో పాల్గొన్న అంశంపై అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా వివాదం నేపథ్యంలో ఆయన పౌరసత్వ హోదా వెలుగులోకి వచ్చింది.


ఇవీ చదవండి:

ముస్కాన్‌కు మరణశిక్ష.. పిల్లల భవితవ్యంపై సౌరభ్ కుటుంబం స్పందనిదే.?

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!

Updated Date - Oct 15 , 2026 | 11:37 AM