Share News

మనాలిలో మంచు భీబత్సం.. రోడ్లపై కార్లు డిష్యుం డిష్యుం.! వీడియో వైరల్

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:51 PM

మానాలిలో భారీగా మంచు కురుస్తోంది. కొన్నిచోట్ల రోడ్లను మంచు కప్పేయడంతో స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మనాలిలో మంచు భీబత్సం.. రోడ్లపై కార్లు డిష్యుం డిష్యుం.! వీడియో వైరల్
Manali Snowfall Kullu Manali Traffic Issues

ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని కులు మనాలిలో ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. ఇదే సమయంలో అక్కడ కురుస్తున్న మంచు(Snowfall)వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు భారత వాతావరణ శాఖ(IMD) ఈ వారమంతా.. మనాలిలో విస్తృతంగా మంచు కురవడం సహా వర్షాలు కూడా పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లిన కొందరు వాహనదారులు మంచులో ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా అక్కడ జరిగిన రెండు సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఓ వీడియోలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్ కారును అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే.. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.


మరో వీడియోలో మంచు వర్షం కురుస్తున్న సమయంలో రోడ్లపైకి వచ్చిన కార్లు ఒకదానికొకటి ఢీ కొంటున్నాయి. చిన్న ప్రమాదాలు కావడంతో ప్రాణాలకు ఎలాంటి నష్టం కలగకపోయినా.. వాహనాలకు డ్యామేజ్ అయినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా అక్కడి ప్రభుత్వం.. మనాలి, పరిసర ప్రాంతాలలో ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం 685 రోడ్లు మూసివేశారని అక్కడి నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. మనాలి ప్రాంతంలో మంచు కురుస్తున్న వేళ.. వాహనదారులు తమ వాహనాలను బయటకు తీసుకురావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..

For More National News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 01:32 PM