Share News

అమెరికా వెళ్లే క్రమంలో ముగ్గురు గుజరాత్‌ వాసుల అదృశ్యం.. రూ.కోటి డిమాండ్!

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:23 PM

అమెరికాలో స్థిరపడాలని ఆశతో బయలుదేరిన గుజరాత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు విదేశాల్లో అదృశ్యమయ్యారు. వీరిని అపహరించినట్టు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడం, రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అమెరికా వెళ్లే క్రమంలో ముగ్గురు గుజరాత్‌ వాసుల అదృశ్యం.. రూ.కోటి డిమాండ్!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో స్థిరపడాలని ఆశతో బయలుదేరిన గుజరాత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు విదేశాల్లో అదృశ్యమయ్యారు. వీరిని అపహరించినట్టు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడం, రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదృశ్యమైన వారు మెహసానా జిల్లాకు చెందిన మమతా చావ్డా(30), ఆమె బంధువులు రుత్విక్‌ జాన్సారి(23), మయూరి సోలంకి(27)గా గుర్తించారు. వారంతా ఓ ఏజెంట్ ద్వారా ఈ నెల 20న యూఎస్‌కు బయలుదేరారు.


కాగా.. మమత భర్త గత మూడేళ్లుగా స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కూడా యూఎస్‌కు వెళ్లేందుకు 6 సార్లు వీసా కోసం దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైందన్నారు. దీంతో ఎలాగైనా కుటుంబంతో కలవాలనే ఉద్దేశంతో ఆమె స్థానిక ఏజెంట్‌ అల్పేశ్‌ పంచాల్‌ను సంప్రదించారు. ఇతర మార్గాల్లో అమెరికాకు పంపుతానని ఆ ఏజెంట్ హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వడోదరకు చెందిన మరో ఏజెంట్‌‌తో పరిచయం ఏర్పడింది. ముగ్గురినీ యూఎస్‌లో దింపేందుకు ఒక్కొక్కరి వద్ద రూ.75 లక్షల ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అలా సెప్టెంబర్ 20న ముగ్గురినీ గోజారియా నుంచి రాజస్థాన్‌లోని జైపుర్‌కు తరలించారు. అక్కడి నుంచి విమానంలో అబుదాబికి, ఆ తర్వాత ఇథియోపియా రాజధాని అడిస్‌ అబాబాకు పంపినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న మమత కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాము సురక్షితంగా కెనెడా చేరుకున్నామని చెప్పారు. ఆ తర్వాత ముగ్గురి మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి.


ఇదిలా ఉండగా.. సెప్టెంబరు 25న ఖాన్‌ అనే ఓ వ్యక్తి ఆ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. ముగ్గురినీ కిడ్నాప్‌ చేశామని.. వారిని వదిలిపెట్టేందుకు రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తమ వద్ద అంత డబ్బులేదని, ఆర్థికంగా బాగా చితికిపోయామని ఆవేదన చెందిన వారు.. తమ పిల్లలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.


మరోవైపు.. ముగ్గురూ కెనడాకు చేరుకోలేదని ఏజెంట్‌ అల్పేశ్‌ పంచాల్‌ పేర్కొన్నట్లు సమాచారం. వారు ఇథియోపియాలో ఉన్నప్పుడే కిడ్నాప్‌నకు గురైయ్యారని అతడు ఆరోపించాడు. వారితో పాటు తనకు పరిచయమున్న మరో వ్యక్తి కూడా కనిపించట్లేదని పంచాల్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఆరోపణలు, కిడ్నాప్‌ జరిగిన తీరుపై గుజరాత్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


ఇవీ చదవండి:

అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు

ప్రధాని మోదీ, CEC జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు!

Updated Date - Sep 30 , 2026 | 05:23 PM