Share News

ప్రధాని మోదీ, CEC జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు!

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:54 PM

దేశంలో పూర్తి చట్టపరమైన మినహాయింపు పొందుతున్న ఏకైక వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రధాని మోదీ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

 ప్రధాని మోదీ, CEC జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు!
Rahul Gandhi Attacks CEC Gyanesh Kumar as INDIA Bloc Seeks Resignation

ఢిల్లీ, సెప్టెంబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో పూర్తి చట్టపరమైన మినహాయింపు పొందుతున్న ఏకైక వ్యక్తి సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ మాత్రమేనని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


మరోవైపు, INDIA కూటమి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. CEC వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) వల్ల దాదాపు 13.3 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని ఖర్గే ఆరోపించారు. ఈ ప్రక్రియను రద్దు చేసి పాత ఓటర్ల జాబితానే కొనసాగించాలని కోరారు.


కూటమి సమావేశానికి కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, శివసేన (యుబీటీ), ఆర్‌జేడీ, సీపీఐ, సీపీఎం, జెఎంఎం తదితర 19 ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 03:14 PM