రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 06 , 2026 | 09:28 PM
రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కీలక ప్రకటన చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఏ రాజకీయ పార్టీ తమతో భేటీ కోసం సమయం కోరలేదని తెలిపారు.
ఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు (Election Commission) కీలక ప్రకటన చేశారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటల వరకు ఏ రాజకీయ పార్టీ తమతో భేటీ కోసం సమయం కోరలేదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీల ప్రతినిధి బృందం తమను కలవాలనుకుంటున్నట్లు 4 గంటల తర్వాత ఢిల్లీ పోలీసుల ద్వారా తమకు సమాచారం అందిందని వెల్లడించారు. రాజకీయ పార్టీలతో భేటీలకు 2025లోనే ఈసీ ప్రత్యేక విధానం రూపొందించిందని చెప్పుకొచ్చారు.
ఈసీని కలవాలంటే అధికారిక ప్రతినిధి ద్వారా ముందుగా సమయం కోరాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. రెండు పక్షాల పరస్పర అంగీకారంతో భేటీ సమయం ఖరారవుతుందని చెప్పారు. 240 మంది ఎంపీలతో సమావేశం కావాలని ప్రతిపాదన వచ్చినట్లు ఢిల్లీ పోలీసుల సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. సమావేశం వేదికగా పార్లమెంట్ అనెక్స్‌ను ప్రతిపాదించారన్నారు. పార్లమెంట్ అనెక్స్‌లో భేటీ ప్రతిపాదన అసాధారణమని చెప్పారు.
ప్రోటోకాల్ ప్రకారం ఈసీ కార్యాలయ ప్రాంగణంలోనే భేటీలు జరగాలని స్పష్టం చేశారు. ఎంపీల వినతిపత్రం స్వీకరించేందుకు సీనియర్ అధికారిని పంపుతామని ప్రతిపాదన చేశామని పేర్కొన్నారు. తమ ప్రతిపాదనను ఎంపీలు తిరస్కరించారని ప్రెస్‌నోట్‌లో తెలిపారు. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య ప్రక్రియలను ఈసీ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఈసీతో భేటీకి అభ్యర్థించవచ్చని తెలిపారు. అనుకూల సమయంలో భేటీ తేదీ, సమయాన్ని ఈసీనే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News