Share News

హానికర ఉత్పత్తుల ప్రచారంపై రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:46 PM

సినీ నటులు తమకున్న ప్రజాదరణను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రచారం చేసే ముందు వారు పలుమార్లు ఆలోచించాలని సూచించారు.

హానికర ఉత్పత్తుల ప్రచారంపై రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు
President Murmu asks stars not to promote harmful products

ఇంటర్నెట్ డెస్క్: సినీ నటులు తమకున్న ప్రజాదరణను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రచారం చేసే ముందు వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారామె. అయితే.. ముర్ము వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చలు జోరందుకున్నాయి. హానికరమన్న ప్రాడక్ట్స్‌ను ప్రచారం చేయొద్దని చెబుతున్నప్పుడు.. వాటి తయారీ, విక్రయాలపై ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


కాగా.. నిన్న(మంగళవారం) 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రపతి ముర్ము సినీ ప్రముఖులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా యువత, పిల్లలపై సినీ తారలు చూపే ప్రభావాన్ని ప్రస్తావించారు. ప్రముఖుల మాటలు, చేతలు కోట్లాది మంది ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయన్న ఆమె.. వాటిని సమాజహితానికి మాత్రమే ఉపయోగించాలని సూచించారు. 'రియల్ స్టార్స్ వెలుగును పంచాలి.. చీకటిని కాదు' అన్న ఆమె వ్యాఖ్యలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించడానికి ముందు వారు సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆమె పరోక్షంగా సూచించారు.


అయితే.. రాష్ట్రపతి వ్యాఖ్యలకు పలువురు మద్దతు తెలుపగా.. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా చిన్నారులు, యువతపై సినీ తారల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ప్రముఖుల ప్రకటనల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కొందరు పేర్కొన్నారు. అసలు సమస్య సెలబ్రిటీల ప్రచారంతోనే ముగిసిపోదని ఇంకొందరు కామెంట్ చేశారు. ఒక ప్రాడక్ట్ ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వం భావిస్తే.. దాని తయారీ, అమ్మకాలను ఎందుకు నిషేధించడం లేదని వారు నిలదీశారు.

President Murmu asks stars not to promote harmful products, X asks 'why not ban?'President Murmu asks stars not to promote harmful products, X asks 'why not ban?'President Murmu asks stars not to promote harmful products, X asks 'why not ban?'President Murmu asks stars not to promote harmful products, X asks 'why not ban?'


కాగా.. పాన్‌మసాలా వంటి ఉత్పత్తులకు సినీ ప్రముఖులు ప్రచారం చేయడంపై ఇప్పటికే వివాదం చెలరేగింది. గత ఆగస్టులో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే.. ఆ ప్రకటనతో సంబంధమున్న బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 01:46 PM