ఆసియా గేమ్స్: షూటింగ్‌లో భారత్‌కు 2 కాంస్యాలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:27 PM
ఆసియా గేమ్స్-2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. పురుషులు, మహిళల స్కీట్ టీమ్ విభాగంలో మూడో స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో మరో రెండు కాంస్యాలు చేరాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా గేమ్స్-2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. నేడు భారత్ ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి. పురుషుల స్కీట్ టీమ్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నరూకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవ్‌తేఘ్ సింగ్ గిల్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం సాధించింది. కజకిస్థాన్‌తో సమానంగా 346 పాయింట్లు సాధించిన భారత్.. ఉత్కంఠభరిత షూట్‌ఆఫ్‌లో పైచేయి సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక.. వ్యక్తిగత స్కీట్ విభాగంలో క్వాలిఫై రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అనంత్‌జీత్.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. నేడు(బుధవారం) మధ్యాహ్నం జరిగే తుది పోరులో అతడు తలపడనున్నాడు.
ఇక.. మహిళల స్కీట్ టీమ్ విభాగంలోనూ బ్రాంజ్‌తో మెరిసింది భారత్. రైజా థిల్లాన్, పరీనాజ్ ధాలీవాల్, మహేశ్వరి చౌహాన్‌లతో కూడిన భారత జట్టు 331 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 346 పాయింట్లతో చైనా పసడి నెగ్గగా, కజకిస్థాన్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ ఆసియా క్రీడల్లో పతకం ఖాయం అనుకున్న అథ్లెట్, ఒలింపిక్ పతక విజేత మనూ బాకర్ నిరాశపరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరినా.. రౌండ్‌లో ఆమె ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్ తరఫున బరిలోకి దిగిన సురుచి ఇందర్‌సింగ్, ఈషా సింగ్‌లు కూడా తుది పోరుకు అర్హత సాధించలేకపోయారు.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు