Share News

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ప్రధాన కార్యాలయం ఖాళీ చేయాలంటూ నోటీసు

ABN , Publish Date - Mar 25 , 2026 | 01:03 PM

దేశ రాజధానిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి అధికారులు నోటీసు అందించారు. ల్యుటియన్స్ జోన్‌ ఖాళీ చేయాలని అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీసు ఇచ్చారు. అలాగే 5వ నెంబర్ రైసినా రోడ్‌లోని యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు.

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ప్రధాన కార్యాలయం ఖాళీ చేయాలంటూ నోటీసు
Akbar Road Congress HQ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి (Congress Headquarters) అధికారులు నోటీసు అందించారు. ల్యుటియన్స్ జోన్‌ ఖాళీ చేయాలని అక్బర్ రోడ్‌(Akbar Road)లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీసు(Exit Notice to Congress) ఇచ్చారు. అలాగే 5వ నెంబర్ రైసినా రోడ్‌లోని యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు. మార్చి 28లోపు రెండు ప్రాంగణాలను ఖాళీ చేయాలని డెడ్‌లైన్ విధించారు అధికారులు.


కాగా, 1978 నుంచి అంటే దాదాపు 48 ఏళ్ల నుంచి అక్బర్ రోడ్‌లోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను కాంగ్రెస్ నిర్వహిస్తోంది. అయితే, బలవంతపు తొలగింపును అడ్డుకునేందుకు న్యాయపరమైన మార్గాలను పరిశీంచి కోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, గతేడాది కోట్లా మార్గ్‌లో తమ కొత్త ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అయినప్పటికీ అక్బర్ రోడ్ ప్రాంగణాన్ని ఇంకా ఖాళీ చేయలేదు. పార్టీ కార్యకలాపాలు అక్కడే కొనసాగుతున్నాయి. అక్బర్ రోడ్ కార్యాలయంతో తమకు ఎంతో భావోద్వేగ బంధం ఉందని పలువురు పార్టీ సీనియర్లు చెబుతున్నారు.


చారిత్రక ప్రాధాన్యం..

ఈ భవనానికి చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో వైస్రాయ్ లార్డ్ లిన్లిత్‌గో కార్యనిర్వాహక మండలి సభ్యుడైన సర్ రెజినాల్డ్ మాక్స్‌వెల్ ఇక్కడే నివసించారు. 1960ల ప్రారంభంలో భారతదేశంలో మయన్మార్ రాయబారి అయిన డా.ఖిన్‌ కీ నివాసంగా ఉండేది. ఆ తర్వాత నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న డా.ఖిన్‌ కీ కుమార్తె ఆంగ్ సాన్ సూకీ చాలా సంవత్సరాలు అక్కడే నివాసం ఉన్నారు.


1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందింది. దీంతో పార్టీ చీలిపోయే పలిస్థితులు వచ్చాయి. ఇందిరాగాంధీ వర్గానికి పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఓ భవనం కావాల్సి వచ్చింది. ఇందిరా గాంధీకి విధేయుడైన అప్పటి రాజ్యసభ ఎంపీ జి.వెంకటస్వామి అక్బర్ రోడ్‌లోని తన బంగ్లాను ఇచ్చారు. ఇక, అప్పటి నుంచి కాంగ్రెస్ తరఫున ప్రధానమంత్రులైన రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ సహా అందరూ దీన్ని ప్రధాన కార్యాలయంగా కొనసాగించారు.


ఈ వార్తలు కూడా చదవండి

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి

Updated Date - Mar 25 , 2026 | 01:31 PM