కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎగిసిపడుతున్న మంటలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:43 PM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఎయిర్ పోర్ట్‌పై డ్రోన్‌తో దాడికి పాల్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ (Iran) డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్(Kuwait) అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. డ్రోన్ ఓ ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌కు చెందిన డ్రోన్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా దూసుకెళ్లాయి. అందులో ఒక డ్రోన్ విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదం దాటికి ట్యాంకర్ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. విమానాశ్రయం పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్.. డ్రోన్లతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజా దాడి కువైట్ భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై కువైట్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మంటలు అదుపు చేసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇరాన్ నుంచి వచ్చిన పలు డ్రోన్లు, క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ దళాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం జరిగిందని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ధ్రవీకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓఆర్‌ఆర్ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు
Read Latest Telangana News and National News