Share News

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

ABN , Publish Date - Mar 25 , 2026 | 08:02 AM

సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సోనియా గాంధీని న్యూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
Sonia Gandhi Hospitalized

ఇంటర్నెట్ డెస్క్: సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను న్యూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. డాక్టర్ అనూప్ నేతృత్వంలోని వైద్యుల బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రస్తుతం తల్లి వెంటే ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన పడొద్దని వైద్యులు తెలిపారు.


జనవరి నెలలోనూ అస్వస్థకు గురైన సోనియా గాంధీ అప్పుడు కూడా గంగారం ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ పొందారు. సోనియా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆసుపత్రి వర్గాలు అప్పట్లో ప్రకటించాయి. కాలుష్యం వల్ల ఆమె అస్వస్థతకు గురై ఉంటారని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

కర్ణాటకలో హోటల్ యజమాని ఆత్మహత్య.. సిలిండర్ల కొరతే కారణమా?

'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' ట్వీట్‌కు స్పందన.. రీహాబిలిటేషన్ సెంటర్‌కు మానసిక రోగి

Updated Date - Mar 25 , 2026 | 09:37 AM