'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' ట్వీట్‌కు స్పందన.. రీహాబిలిటేషన్ సెంటర్‌కు మానసిక రోగి
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:18 PM
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఓ మానసిక రోగి పడుతున్న ఇబ్బందిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌కు జోనల్ కమిషనర్ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడాలంటే ముందుగా హైదరాబాద్ ప్రజల భద్రతపై దృష్టిపెట్టాలని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి చేసిన ట్వీట్‌కు జోనల్ కమిషనర్ స్పందించారు. జోనల్ కమిషనర్ ఆదేశాలతో మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని వెంటనే బేగంపేట్ నైట్ షెల్టర్‌కు తరలించారు. ఈ మేరకు నగర ప్రజల భద్రతపై బాధ్యతాయుతంగా స్పందించి సోషల్ మీడియా వేదికగా తమ దృష్టికి తీసుకువచ్చిందుకు ఏబీఎన్ డైరెక్టర్‌కు జోనల్ కమిషనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అంతకముందు.. నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో మానసిక వేదనకు గురైన ఓ వ్యక్తిని చూసి చలించిపోయారు భానుప్రకాశ్. కేబీఆర్ పార్క్ వద్ద మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కనీసం రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించాలని 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సిటీలతో పోటీ పడాలంటే ముందుగా ప్రజల భద్రత, మానసిక ఆరోగ్యంపై దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు భాగ్యనగర ప్రతిష్ఠను, గౌరవాన్ని దెబ్బతీస్తాయని రాసుకొచ్చారాయన.
ఇవీ చదవండి:
యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు