Share News

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రభావం ఉంది: మోదీ

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:45 PM

పశ్చిమాసియాలో పరిణామాలు, భారత్‌పై దాని ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అంతరాయం కలుగుతోందని చెప్పారు.

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రభావం ఉంది: మోదీ
PM Modi

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పరిణామాలు, భారత్‌పై దాని ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాజ్యసభ (Rajya Sabha)లో మాట్లాడారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అంతరాయం కలుగుతోందని చెప్పారు. ఇంధన సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోందన్నారు. పశ్చిమాసియాలో తలెత్తిన పరిణామాలపై లోక్‌సభలో మాట్లాడిన మరుసటి రోజే ఆయన రాజ్యసభ సభ్యులతో ఆ వివరాలను పంచుకున్నారు.


గల్ఫ్ దేశాల్లోని భారతీయులు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని ప్రధాని తెలిపారు. ఆయా దేశాల్లో కోటి మందికి పైగా భారతీయ కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. గల్ఫ్ దేశాల నుంచి 3.75 లక్షల మందిని సురక్షితంగా భారతదేశం తీసుకువచ్చామని చెప్పారు. భారతీయుల రక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. మన మందు చాలా సవాళ్లు ఉన్నాయని చెప్పారు.


అర్థిక వ్యవస్థకు ఇంధనమే వెన్నెముక అని, ఇంధన భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని చెప్పారు. గృహావసరాలకు సరిపడా ఎల్పీజీ సరఫరా పెంచుతున్నామని చెప్పారు. 41 దేశాల నుంచి పెట్రో ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నామని, 53 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడిందన్నారు. 'యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు, యుద్ధం ప్రభావం పడిన దేశాలతో ప్రభుత్వం నిరంతర సంప్రదింపులు సాగిస్తోంది. శత్రుత్వం వీడి, ఉద్రిక్తతలకు తగ్గించేందుకు కృషి చేయాలని అన్ని పక్షాల వారిని భారత్ కోరుతోంది. ఇండియాపై కూడా యుద్ధం ప్రభావం ఉంది. వాణిజ్య మార్గాలపై ప్రభావం పడి రొటీన్‌గా వచ్చే పెట్రోల్, డీజిల్, ఎరువలపై ప్రభావం పడుతోంది. అయితే వీటి సరఫరాకు అవాంతరాలు తలెత్తకుండా ఇండియా అన్ని ప్రయాత్నాలు చేస్తోంది' అని వివరించారు. ఈ దశలో పెద్దల సభ ఏకగ్రీవంగా శాంతి, చర్చల సందేశాన్ని ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇది కరోనా తరహా సంక్షోభం

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 24 , 2026 | 04:00 PM