Share News

పాక్‌ కోసం గూఢచర్యం.. ఉత్తరప్రదేశ్‌లో 22 మంది అరెస్టు

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:47 AM

పాకిస్థాన్‌తో సంబంధాలున్న ఓ భారీ గూఢచర్య ముఠా గుట్టును ఘజియాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భోవపూర్‌లోనూ కొందరు యువకులు ...

పాక్‌ కోసం గూఢచర్యం.. ఉత్తరప్రదేశ్‌లో 22 మంది అరెస్టు

ఘజియాబాద్‌, మార్చి 23: పాకిస్థాన్‌తో సంబంధాలున్న ఓ భారీ గూఢచర్య ముఠా గుట్టును ఘజియాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భోవపూర్‌లోనూ కొందరు యువకులు రైల్వేస్టేషన్లు, సైనిక స్థావరాల ఫొటోలు, వీడియోలు తీసి ఎవరికో పంపుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే, వీళ్ల వెనుక పాకిస్థాన్‌తో సంబంధాలున్న గూఢచర్య ముఠా హస్తం ఉన్నట్టు విచారణలో గుర్తించారు. పోలీసులు ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను పరిశీలించగా.. సైనిక స్థావరాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, లొకేషన్‌ ట్యాగ్‌లు వంటివి కనిపించాయి.

Updated Date - Mar 24 , 2026 | 04:47 AM