Share News

24 గంటల్లో రాజీనామా చేయాలి.. లేదంటే దేశవ్యాప్త ఆందోళన.!

ABN , Publish Date - Sep 25 , 2026 | 01:22 PM

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ సీజేపీ ఉద్యమానికి సిద్ధమైంది. 24 గంటల్లో ఆయన రాజీనామా చేయాలని సీజేపీ ఆల్టిమేటం జారీ చేసింది.

24 గంటల్లో రాజీనామా చేయాలి.. లేదంటే దేశవ్యాప్త ఆందోళన.!
CJP Ultimatum to CEC

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమానికి సిద్ధమైంది. 24 గంటల్లో ఆయన రాజీనామా చేయకపోతే.. వచ్చే నెల 2 నుంచి ముంబైలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని సీజేపీ చీఫ్ అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా చేస్తామన్నారు.


ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా.. భారీగా ఓటర్లను తొలగించారంటూ సీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. ఇదే ప్రధానాంశంగా ‘ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో’ పేరిట దేశవ్యాప్తంగా ప్రచారం చేపడుతోంది. ‘సర్’ ప్రక్రియ పూర్తైన రాష్ట్రాల్లో వెలువడిన గణాంకాల ఆధారంగా.. డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాల నుంచి సుమారు 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని సీజేపీ ఆరోపిస్తోంది. ఇలా పెద్దఎత్తున ఓట్లను తొలగించడంతో ఓటు హక్కుపై ప్రభావం చూపుతుందని అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. ప్రతి ఓటును చట్టబద్ధంగా, పారదర్శకంగా, సమర్థవంతమైన సమీక్షకు లోబడి ఉందని ఈసీ వివరించాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.


ఎన్నికల కమిషన్‌లో ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన కొన్ని అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో.. సీజేపీ మరింత జోరుగా ప్రచారం చేస్తోంది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త ఆందోళనతో పాటు ఢిల్లీలో ‘జంతర్‌ మంతర్‌ 2.0’ తరహా నిరసన చేపడతామని సీజేపీ గతంలో ప్రకటించింది. గురువారం ప్రకటించిన 48 గంటల గడువు అనంతరం.. అక్టోబర్‌ 2న ముంబై నుంచి నిరసనలు ప్రారంభిస్తామని దీప్కే తెలిపారు.


ఇవీ చదవండి:

కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం!

ఆసియా రికార్డు బద్దలు.. భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం

Updated Date - Sep 25 , 2026 | 01:22 PM