Share News

కరూర్ కేసు: విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:27 PM

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంగా మారింది. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించి, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సీబీఐ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కరూర్ కేసు: విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు
Tamil Actor Vijay

ఇంటర్నెట్ డెస్క్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్‌కు (Tamil Actor Vijay) సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంగా మారింది. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించి, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సీబీఐ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరూర్ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు విజయ్‌ను విచారణకు రావాలని కోరుతూ నోటీసులు పంపారు.


పది రోజుల సమయం కావాలి: విజయ్

నోటీసులపై స్పందించిన విజయ్, అధికారులకు లిఖితపూర్వక సమాధానం పంపారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్, ఇతర కారణాల వల్ల మంగళవారం జరగాల్సిన విచారణకు హాజరు కాలేనని విజయ్ స్పష్టం చేశారు. విచారణకు సిద్ధమవ్వడానికి, హాజరు కావడానికి తనకు కనీసం 10 రోజుల సమయం కావాలని సీబీఐని కోరారు. గడువు ముగిసిన తర్వాత విచారణకు తప్పకుండా హాజరవుతానని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు.


సీబీఐ తదుపరి చర్యలు..

విజయ్ అభ్యర్థనపై సీబీఐ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. విజయ్ కోరిన 10 రోజుల గడువును పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 03:33 PM